భారత్ లో తొలి HMPV వైరస్ కేసు: ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు

Monday, January 6, 2025 12:31 PM News
భారత్ లో తొలి HMPV వైరస్ కేసు: ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు

చైనాలో విజృంభిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ ఇప్పుడు భారత్ లోకి ప్రవేశించింది. బెంగళూరులోని ఎనిమిది నెలల పాపకు హెచ్ఎంపీవీ వైరస్ సోకింది. నగరంలో బాప్టిస్ట్ హాస్పిటల్లో ఈ కేసు వెలుగు చూసింది. మరో మూడు నెలల చిన్నారికి కూడా ఈ వైరస్ సోకినట్లు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ తెలిపింది.

తొలి రెండు కేసులు కూడా 3 మరియు ఎనిమిది నెలల పసికందుల్లో గుర్తించడం కలకలం రేపుతోంది. అయితే సాధారణంగా 11 ఏళ్ల వయస్సులోపు ఉన్న చిన్నారుల్లో ఈ వైరస్ ఎక్కువగా వస్తుందని తెలుస్తోంది.

For All Tech Queries Please Click Here..!
Topics: