సచివాలయ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ షాక్

Sunday, January 26, 2025 09:39 PM News
సచివాలయ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ షాక్

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. విజన్ 2047లో భాగంగా గ్రామ సచివాలయాల సిబ్బందిని కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. చాలా మంది ఉద్యోగులకు ప్రభుత్వం కోతపెట్టింది.

ప్రభుత్వం సచివాలయాలను ఏ, బి, సి కేటగిరీలుగా విభజించింది. ఎ కేటగిరి సచివాలయాల్లో సిబ్బందిని ఆరు మందికి కుదించింది. బి కేటగిరి సచివాలయాల్లో సిబ్బందిని ఏడుగురికి, సి కేటగిరి సచివాలయాల్లో సిబ్బందిని ఎనిమిది మందికి కుదించింది.

మిగిలిన వారిని వేరే చోట అడ్జస్ట్ చేస్తే, ఆ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకపోవడం అనివార్యం కానుంది. ప్రభుత్వం కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తుందని అనుకున్నా కానీ, వారి స్థానంలో వేరొకరిని నియమించడం వల్ల నిరుద్యోగులు ఇబ్బందుల్లో పడతారని పలువురు భావిస్తున్నారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: