ఈ అధ్యక్షుడు మాకొద్దు.. 40 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా

Thursday, February 6, 2025 06:19 PM News
ఈ అధ్యక్షుడు మాకొద్దు.. 40 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా

అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగాల కోత ప్రారంభమైంది. ది ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్ మెంట్ ఇచ్చిన బై అవుట్ ఆఫర్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 40వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ కొలువులకు రాజీనామా చేసేందుకు అంగీకరించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం వెల్లడించింది. ఈ సంఖ్య భవిష్యత్తులో వేగంగా పెరుగుతుందని తెలిపింది.

బై అవుట్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్ మెంట్ నుంచి ఒక మెమో వెలువడింది. ఈ మేరకు ఒక ఈమెయిల్ 20లక్షల మంది ఉద్యోగులకు వెళ్లింది. స్వచ్చందంగా ఉద్యోగాలను వదులుకుంటే 8నెలల జీతం ఇస్తారని అందులో వెల్లడించారు. ఫిబ్రవరి 6వ తేదీ లోపు ఓ నిర్ణయానికి రావాలని ఇందులో తెలిపారు. దీనిని ఎంచుకున్న వారికి సెప్టెంబర్ వరకు పనిచేయకుండానే జీతం పొందే అవకాశం ఉన్నా అందుకు ఎలాంటి హామీ ఇవ్వలేదని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: