మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్
Tuesday, February 18, 2025 02:00 PM News
_(6)-1739858429.jpeg)
ఏపీలోని మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేసుకునే వారి మూలధన పెట్టుబడిలో ప్లాంటు, యంత్రాలపై రాయితీని 35 నుంచి 45 శాతానికి పెంచింది.
విద్యుత్ టారిఫ్ లోనూ ప్రోత్సాహకాలు కల్పించింది. ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. MSMEలు నెలకొల్పే SC, STలకు భూమి విలువలో గరిష్టంగా రూ.25 లక్షలు లేదా 75 శాతం రాయితీ కల్పిస్తూ మరో ఉత్తర్వులు జారీచేసింది. దీంతో సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేసుకునే వారికి ఉపశమనం లభించనుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: