సైఫ్ అలీఖాన్ కుటుంబానికి షాక్..15వేల కోట్ల ఆస్తి స్వాధీనం
Thursday, January 23, 2025 07:30 AM News
దాడికి గురైన విషయంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ఆయన కుటుంబానికి మధ్యప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. పటౌడీ కుటుంబానికి చెందిన రూ.15,000 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు హైకోర్టు కేంద్రానికి అనుమతిచ్చింది. ఎనిమీ ప్రాపర్టీ చట్టం కింద పాక్ కు వలస వెళ్లినవారి ఆస్తులను కేంద్రం స్వాధీనం చేసుకునే అధికారం ఉంటుంది.
సైఫ్ పూర్వీకులైన పటౌడీ కుటుంబానికి భోపాల్లో ఆస్తులున్నాయి. వీటిపై సైఫ్, ఆయన తల్లి షర్మిల సహా కుటుంబ సభ్యులు కోర్టుకెళ్లారు. ఇన్నాళ్లూ ఆ ప్రాపర్టీపై స్టే విధించిన హైకోర్టు తాజాగా దాన్ని ఎత్తేసింది. దాంతో ఆ ఆస్తులను కేంద్రం స్వాధీనం చేసుకునే వీలు కలగనుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: