ఈ కారును ఫాలో చేస్తే గుండె ఆగిపోతుంది

ఆ కారును ఫాలో అయితే గుండె ఆగిపోతుంది. ఓ వ్యక్తి తన కారు వెనుక వైపు ఎవరూ ఢీకొట్టకుండా వినూత్న జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. కారు వెనుక ఎలాంటి కొటేషన్లు రాయకుండా ఓ వింత నిర్ణయం తీసుకున్నాడు. ఓ వృద్ధుడి బొమ్మను తీసుకొచ్చి కారు వెనుక అద్దం దగ్గర ఉంచాడు. ఇది చూసేందుకు దయ్యంలా కనిపిస్తుండడంతో చూసేవారికి భయం కలిగించేలా ఉంది. కారుకు సమీపంగా వచ్చిన వారు లైటింగ్ వెలుతురులో ఆ బొమ్మను చూసి భయంతో ఆగిపోతున్నారు.
ఇంకొందరు దాని వైపే చూస్తూ అలాగే ఉండిపోతున్నారు. ఇలా తన కారు సమీపానికి ఎవరూ రాకుండా ఇతను వినూత్న ట్రిక్ వాడాడు. ఈ కారును చూసిన వారంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ''వామ్మో్.. ఈ కారును చూస్తుంటేనే భయమేస్తోంది''.. అంటూ కొందరు, ''ఈ కారు డ్రైవర్ తెలివి మామూలుగా లేదుగా''.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.