ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు ఎత్తివేత
Wednesday, January 8, 2025 02:35 PM News
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట రాష్ట్రంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉండవు, కేవలం సెకండ్ పరీక్షలు మాత్రమే ఉంటాయి. ఈ మేరకు ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా ప్రకటించారు.
ఇంటర్ తొలి సంవత్సరానికి పరీక్షలు రద్దు చేసిన నిర్ణయంపై ఈ నెల 26 వరకూ విద్యార్థులు మరియు తల్లిదండ్రుల సలహాలు సూచనలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే 2025-2026 విద్యా సంవత్సరం నుండి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో NCERT సిలబస్ ప్రవేశపెడుతున్నట్లు అధికారులు తెలిపారు.
For All Tech Queries Please Click Here..!
Topics: