మహిళ అరెస్ట్ అవుతుంది.. కిరణ్ రాయల్ ముందే ఎలా చెప్పాడు?

Tuesday, February 11, 2025 01:30 PM News
మహిళ అరెస్ట్ అవుతుంది.. కిరణ్ రాయల్ ముందే ఎలా చెప్పాడు?

తిరుపతి జనసేన ఇన్చార్జి కిరణ్ రాయల్ పై లక్ష్మి అనేక ఆరోపణలు చేయడం.. చివరికి ఆ మహిళనే అరెస్టు చేయడం అందరికీ తెలిసిన విషయమే. ఆమెను జైపూర్‌ పోలీసులు వచ్చి ఆమెను అరెస్ట్‌ చేసారు. రెండు రోజుల్లో ఆమెను అరెస్ట్‌ చేస్తారంటూ మీడియా ముఖంగా కిరణ్‌ రాయల్‌ చెప్పాడు.

కిరణ్‌ రాయల్‌ చేతికి కోటి ఇరవై లక్షలతో పాటు బంగారం కూడా కొంత ఇచ్చి మోసం పోయింది లక్ష్మీ అనే మహిళ. అయితే ఇదే విషయాన్ని బహిర్గతం చేస్తే ఆమెపై తిరిగి ఆరోపణలు చేశాడు. "ఆమె రెండు రోజుల్లో అరెస్ట్‌ అవ్వుది.. జైపూర్‌ నుంచి పోలీసులు వస్తారు" అని చెప్పాడు.

ఆమెను అరెస్ట్‌ చేయడానికి జైపూర్‌ పోలీసులు వస్తారని కిరణ్‌ కు ఎలా తెలుసనేది ఇప్పుడు ఓ పెద్ద ప్రశ్నగా మారింది. ఆమెను ఇరికించాలనే ప్రయత్నంలో భాగంగా పాత కేసును తిరగతోడి రాజస్థాన్‌ పోలీసుల్ని రప్పించారా? ఇక్కడ పోలీసులు అరెస్ట్‌ చేస్తే కూటమి ప్రభుత్వానికి తలనొప్పులు వస్తాయని, ఏకంగా జైపూర్‌కు వెళ్లారా? దీని వెనుక ఉన్నది ఎవరు? అసలు జైపూర్‌ నుంచి పోలీసుల్ని ఇక్కడకు రప్పించి ఆమెను అరెస్ట్‌ చేయిండంలో చక్రం తిప్పింది ఎవరు? అనే వాదన తెరపైకి వచ్చింది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: