Breaking News : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తప్పిన ప్రమాదం
Friday, January 24, 2025 01:43 PM News
తెలంగాణ ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి తన నియోజవర్గం హుజూర్ నగర్ నుంచి జాన్ పహాడ్ కు ఉర్సు ఉత్సవాలకు వెళ్తుండగా మంత్రి కాన్వాయిలో ప్రమాదం చోటుచేసుకుంది.
కాన్వాయితో కారులో వెలుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మండల కేంద్రమైన గరిడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట కొంతమంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిలబడి ఉండటం చూసి మంత్రి కారు ఆపారు. డ్రైవర్ సడన్ గా కారును ఆపడంతో మంత్రి కాన్వాయ్ లో వెనక వేగంగా వస్తున్న 6 కార్లు ఒకేసారి బ్రేక్ వేయడంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మంత్రి కారు వెళ్లిపోవటంతో పోలీసులు వచ్చి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: