కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
Friday, March 14, 2025 11:00 AM News
_(30)-1741919807.jpeg)
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కొత్త కార్డుల జారీ ప్రక్రియ ఏప్రిల్ నుంచి ఉండొచ్చని మంత్రి తెలిపారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి బీపీఎల్ కార్డులు, ఎగువన ఉన్నవారికి ఏపీఎల్ కార్డులు ఇవ్వాలని చూస్తున్నట్లు చెప్పారు.
అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తామని పునరుద్ఘాటించారు. ఇప్పటికే పింక్ కార్డులు ఉన్నవారికి గ్రీన్ కార్డులు, తెల్లకార్డు ఉన్నవారికి ట్రైకలర్ కార్డులు వస్తాయని వెల్లడించారు. అటు ఏపీలోనూ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎప్పుడు ఇస్తారు అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: