తెలుగు రాష్ట్రాల్లో నేడు ఎమ్మెల్సీ పోలింగ్
Thursday, February 27, 2025 07:54 AM News

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. తెలంగాణలో ఉమ్మడి మెదక్, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్, టీచర్, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండలో టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
అటు ఏపీలో ఉమ్మడి గుంటూరు-కృష్ణా, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల్లో గ్రాడ్యుయేట్, ఉత్తరాంధ్రలో టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: