ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడికి గాయాలు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
దీంతో అతని చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ముంగళవారం సింగపూర్ వెళ్లనున్నారు. అడవితల్లి బాటలో భాగంగా ప్రస్తుతం ఆయన అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తున్నారు. డుంబ్రిగుడ మండలం కురిడిలో ఆలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం స్థానికులతో సమావేశమవుతారు. మరో మూడు రోజుల పాటు విశాఖ జిల్లాలోనే ఉండనున్నట్లు పవన్ కల్యాణ్ మంగళవారం ఉదయం ప్రకటించారు. బుధవారం సాయంత్రం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించనున్నట్లు తెలిపారు. అయితే కుమారుడికి ప్రమాదం జరగడంతో ఆయన అల్లూరి జిల్లా పర్యటన అనంతరం సింగపూర్ బయలుదేరనున్నారు.