రూ.55కే పెట్రోల్.. ఏపీలో కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం!
పెట్రోల్ ధర ప్రస్తుతం రూ. 100లకు పైగానే ఉంది. డీజిల్ ధర రూ. 100లోపు ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ రాష్ట్ర సర్కార్ మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది. కేవలం రూ. 55లకే లీటర్ పెట్రోల్, డీజిల్ అందిస్తోంది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది.
చంద్రబాబు సర్కార్ సబ్సిడీపై పెట్రోల్, డీజిల్ ను అందించేందుకు ప్లాన్ చేస్తోంది. లీటర్ పెట్రోల్, డీజిల్ కేవలం రూ. 55లకే అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన చూసిన వాహనదారులు మురిసిపోతున్నారు. కానీ ఈ సబ్సిడీ అందరికీ కాదు. కొందరికి మాత్రమే. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ స్కీమ్ కేవలం దివ్యాంగులకు మాత్రమే. వీళ్లకు మాత్రమే తక్కువ ధరకే ఇంధనం వస్తుంది.
ఆయా జిల్లాల్లోని దివ్యాంగులు సబ్సిడీపై పెట్రోల్, డీజిల్ పొందాలంటే స్వయం ఉపాధి పొందుతున్నా లేదంటే ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నవారు మాత్రమే ఈ ప్రయోజనం పొందవచ్చు. ఇందుకు సంబంధించి సంక్షేమ శాఖ కార్యాలయంలో నమోదు చేసుకోవాలి. పెట్రోల్, డీజిల్ పై సబ్సిడీ పొందాలంటే వెంటనే అప్లై చేసుకోవాలి. మూడు చక్రాల మోటర్ రైజ్డ్ వాహనం కలిగి ఉన్న దివ్యాంగులు ఈ బెనిఫిట్స్ పొందవచ్చు. పెట్రోల్, డీజిల్ ధరపై 50% సబ్సిడీ లభిస్తుంది. ఈ సబ్సిడీ స్కీమ్ అమలు కోసం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 26 జిల్లాలో రూ. 26 లక్షలు కేటాయించినట్లు తెలుస్తోంది.
కూటమి ప్రభుత్వం ఈ సబ్సిడీ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తుంది. అయితే ఈ సబ్సిడీపై కూడా కాలపరిమితి అనేది ఉంటుంది. 2 హెచ్ పి వాహనం అయితే నెలకు 15 లీటర్ల వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాహనం అయితే నెలకు 25 లీటర్ల వరకు మాత్రమే రాయితీ పొందేందుకు అవకాశం ఉంటుంది.
ఈ సబ్సిడీ పొందాలంటే వారు పెట్రోల్, డీజిల్ కు సంబంధించిన బిల్లులను క్రమం తప్పకుండా సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత దివ్యాంగులకు తమ బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుంది. మీరు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31వ తేదీ చివరి తేదీ అని అధికారులు ప్రకటించారు.