తెలంగాణలో ముగిసిన కుల గణన.. బీసీ జనాభా ఎంతంటే..
Sunday, February 2, 2025 10:30 PM News

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కులగణన సర్వే నివేదికను ప్లానింగ్ కమిషన్ అధికారులు కేబినెట్ సబ్ కమిటీకి అందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కులగణన సర్వే దాదాపు 50 రోజుల పాటు సాగింది. రాష్ట్ర ప్రజల ఆర్థిక, సామాజిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సంబంధిత వివరాలను సేకరించారు.
మొత్తం 3,889 మంది అధికారులు ఈ సర్వే నిర్వహణలో పాల్గొన్నారు. 96.9 శాతం కుటుంబాలను సమీక్షించి, 3 కోట్ల 54 లక్షల మంది తమ వివరాలను నమోదు చేసారు. 3.1% మంది ప్రజలు సర్వేలో పాల్గొనలేదని కమిషన్ నివేదికలో పేర్కొంది. ఈ సర్వేలో బీసీ జనాభా 46 శాతంగా ఉన్నట్లు తెలుస్తోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: