ఆహారకల్తీలో ఏపీ, తెలంగాణ స్థానాలు ఇవే..
Monday, April 7, 2025 03:19 PM News
_(26)-1744019343.jpeg)
ఆహార కల్తీలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఆహార భద్రత అధికారులు గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా సేకరించిన ఆహార నమూనాల్లో సగటున 22 శాతం కల్తీవే ఉన్నాయి. 2021-24 మధ్య దేశవ్యాప్తంగా సేకరించిన ఆహార పదార్థాల నమూనాలు, అందులో కల్తీవిగా తేలిన నమూనాల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ రాష్ట్రాల వారీగా ఇటీవల పార్లమెంటుకు నివేదించింది.
ఈ లెక్కల ప్రకారం ఆహార కల్తీలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ రెండోస్థానంలో నిలిచింది. తెలంగాణలో సేకరించి పరీక్షించిన ప్రతి 100 నమూనాల్లో 14 కల్తీ ఆహారంగా తేలాయి. తమిళనాడు 20 శాతం సగటుతో దక్షిణాది రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉంది. కేరళ 13.11 శాతం, ఆంధ్రప్రదేశ్ 9 శాతం, కర్ణాటక 6.30 శాతంతో వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: