హీరో విశాల్ ఆరోగ్యంపై హెల్త్ రిపోర్ట్: డాక్టర్లు ఏమన్నారంటే...?

Monday, January 6, 2025 09:08 PM News
హీరో విశాల్ ఆరోగ్యంపై హెల్త్ రిపోర్ట్: డాక్టర్లు ఏమన్నారంటే...?

ప్రముఖ తమిళ హీరో విశాల్ తాజాగా తన మూవీ రిలీజ్ ఈవెంట్లో కనబడిన తీరు అభిమానులందరినీ ఆందోళనకు గురిచేసింది. మదగరాజు మూవీ ప్రెస్ మీట్ లో ఆయన సన్నబడిపోయి, కాళ్లు చేతులు వణుకుతూ మాట్లాడటంతో ఆదివారం నుండి సోషల్ మీడియాలో విశాల్ ఆరోగ్యంపై పలు స్టోరీలు చక్ర్లు కొడుతున్నాయి. అయితే వీటన్నింటికీ పుల్ స్టాప్ పెడుతూ... హీరో విశాల్ ఆరోగ్య పరిస్థితిని తెలుపుతూ ఒక హెల్త్ రిపోర్టును విశాల్ టీమ్ విడుదల చేసింది. ఇందులో ఆయన వైరల్ ఫీవర్ తో ఇబ్బందిపడుతున్నారని.. డాక్టర్లు బెడ్ రెస్ట్ సూచించినట్లు రిపోర్టులో ఉంది.

డైరక్టర్ సుంద్.సి తెరకెక్కించిన మదగరాజ చిత్రంలో హీరో విశాల్, అంజలి మరియు వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్లుగా నటించారు. 12 ఏళ్ల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాతికి కానుకగా జనవరి 12న విడులకు సిద్దమైంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం చెన్నైలో ఈ ఆదివారం ఓ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విశాల్, ఖుష్బూ, సుందర్ మరియు మ్యూజిక్ డైరక్టర్ విజయ్ ఆంటోని పాల్గొని మూవీ విశేషాలు పంచుకున్నారు. హీరో విశాల్ సినిమా గురించి మాట్లాడుతున్న సమయంలో ఆయన చేతులు వణుకుతూ కనిపించాయి. అయితే అక్కడే ఉన్న యాంకర్ కలుగజేసుకుని  విశాల్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని చెప్పింది. ఇక అప్పటి నుండి విశాల్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆదోళన వ్యక్తం చేశారు.

For All Tech Queries Please Click Here..!
Topics: