కిరణ్ రాయల్ వద్ద పవన్ కళ్యాణ్ రహస్య వీడియోలు: లక్ష్మి

జనసేన తిరుపతి ఇన్చార్జి కిరణ్ రాయల్ పై లైంగిక ఆరోపణలు చేసిన బాధితురాలు లక్ష్మీ రెడ్డిని జైపూర్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆమె తాజాగా మీడియా సమావేశంలో సంచలన విషయాలు వెల్లడించారు. కిరణ్ రాయల్ దగ్గర పవన్ రహస్య జీవితాన్ని సంబంధించిన పెన్ డ్రైవ్ ఉందని, నను ఏమి చేయడని, నన్ను ఏమీ అనడని కిరణ్ నాతో చాలా సార్లు చెప్పాడని ఆమె తెలిపారు.
దౌర్జన్యంగా జైపూర్ పోలీసులు వచ్చి తనను అరెస్ట్ చేశారని చెప్పారు. లోకల్ పోలీసులు లేకుండా నన్ను అరెస్ట్ చేశారన్నారు. ఒక వెధవని వెధవా అంటూ నిరూపించడానికి ఒక మహిళకు చాలా కష్టం వచ్చిందని ఆవేదన చెందారు. 41 ఏ నోటీసులు ఇచ్చారా అని న్యాయమూర్తి ప్రశ్నిస్తే జైపూర్ పోలీసుల వద్ద సమాధానం లేదని తెలిపారు. ప్రైవేట్ వెహికల్ లో జైపూర్ పోలీసులు ఎలా వచ్చారని ప్రశ్నించారు. చెన్నై ఎయిర్పోర్టులో నా బిడ్డను ఒంటరిగా వదిలి వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లైట్ టికెట్ కు డబ్బులు లేక మరుసటి రోజు మా అబ్బాయి జైపూర్ కు వచ్చాడని తెలిపారు. జైపూర్ పోలీసుల ద్వారా నన్ను కిడ్నప్ చేయాలని చూశారా అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు మా వెంట లేరని తెలిపారు. మాకు ఉన్న ఏకైక ప్రాపర్టీ అమ్ముకుని బెయిల్ పై భయటకు వచ్చానని తెలిపారు. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ నా వెంట ఉన్నాడని నిత్యం కిరణ్ రాయల్ చెప్పే వాడని పేర్కొన్నారు. నేను పవన్ కళ్యాణ్ నే చాలా సార్లు బ్లాక్ మెయిల్ చేశానని, ఇక నువ్వు ఎంత అని నాతో అన్నాడని ఆమె తెలిపారు. మాజీ మంత్రి రోజా బంధువును కూడా కిరణ్ రాయల్ ట్రాప్ చేశాడని సంచలన ఆరోపణలు చేశారు.