మళ్ళీ వింత వ్యాధి.. సోకిన 48 గంటల్లోనే చనిపోతారు
Wednesday, February 26, 2025 04:00 PM News
_(7)-1740563495.jpeg)
కాంగో దేశాన్ని ఓ వింత వ్యాధి ఐదు వారాలుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. జ్వరం, వాంతులు, అంతర్గత రక్తస్రావంతో ప్రజలు చనిపోతున్నారు. ఈ లక్షణాలు ఎబోలా, డెంగ్యూ, మార్బర్గ్, యెల్లో ఫీవర్‌ను పోలివుండటంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) సైతం ఆందోళన వ్యక్తం చేసింది.
కొన్ని రోజుల క్రితం బొలొకొ గ్రామంలో గబ్బిలాలను తిన్న ముగ్గురు పిల్లలు 48 గంటల్లోపే చనిపోవడంతో ఈ వ్యాధి వ్యాప్తి బయటపడింది. ఈ వ్యాధి ఇప్పటి వరకు 419 మందికి సోకింది. 53 మంది చనిపోయారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: