రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

Tuesday, January 28, 2025 08:16 AM News
రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఆ పథకాల కింద రూ.579 కోట్లు విడుదల చేసింది. దీంతో విడతల వారీగా అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. తొలి రోజు 4.41 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.569 కోట్లు జమ చేసింది. అలాగే 18,180 రైతు కూలీ కుటుంబాలకు రూ.6 వేల చొప్పున రూ.10.91 కోట్లు అందించింది.

అయితే ఆంధ్రపదేశ్ లో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు రూ.20వేలు అందించడానికి ఆర్థిక పరిస్థితి బాగాలేదని సీఎం చంద్రబాబు వెల్లడించిన విషయం తెలిసిందే.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: