వీడని ఉత్కంఠ : తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా..

Monday, February 3, 2025 10:40 PM News
వీడని ఉత్కంఠ : తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా..

గత కొన్ని రోజులుగా తిరుపతిలో రాజకీయాలు వేడెక్కిన విషయం తెలిసిందే. సోమవారం తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వైసీపీ కార్పొరేటర్లను కూటమి నేతలు కిడ్నాప్ చేశారని, వారిని ఓటింగ్ కోసం విడుదల చేస్తే ఎన్నికల్లో పాల్గొంటామని వైసీపీ నేతలు చెబుతున్నారు. కూటమి నుంచి డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా మునికృష్ణ బరిలోకి దిగగా, చివరి నిమిషంలో వైసీపీ అభ్యర్థిగా లడ్డు భాస్కర్ పేరు ప్రకటించింది. కూటమి అభ్యర్థికి 30 మంది కార్పొరేటర్ల మద్దతు ఉందని తెలుస్తోంది. ఓటింగ్‍లో 47 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్ అఫిషియో సభ్యులు పాల్గొనాల్సి ఉంది. అయితే ఓటింగ్ నిర్వహించడానికి అవసరమైన కోరం సభ్యులు హాజరుకాని కారణంగా డిప్యూటీ మేయర్ ఎన్నికను వాయిదా వేశారు.

మొత్తం 50 మంది పాల్గొనాల్సి ఉండగా, కేవలం 22 మంది హాజరయ్యారు. 50 శాతం కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారి, జేసీ శుభం బన్సల్ ప్రకటించారు. ఈ ఎన్నికను మంగళవారం నిర్వహించనున్నారు.

ఎస్వీయూ పోలీస్ స్టేషన్ పరిధిలో తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుంది. కూటమి పార్టీల కార్పొరేటర్లు ఎన్నికకు హాజరయ్యారు. వైసీపీ కార్పొరేటర్లు బస్సులో ఎస్వీ యూనివర్సిటీ వద్దకి వచ్చారు. ఒక్కసారిగా బస్సు పై దాడి చేసి కార్పొరేటర్లను కారులో తీసుకెళ్లారని ఆరోపిస్తూ.. వైసీపీ కార్పొరేటర్లు, మేయర్, ఎంపీ ఈ ఎన్నికను బహిష్కరించారు. తమ కార్పొరేటర్లను వదిలి పెడితేనే తాము ఓటింగ్ లో పాల్గొంటామని, లేకపోతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. 


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: