ఏపీలో పనిచేసే వయసులో పనిలేని వాళ్లు ఎంత మందో తెలుసా..

Thursday, April 17, 2025 01:00 PM News
ఏపీలో పనిచేసే వయసులో పనిలేని వాళ్లు ఎంత మందో తెలుసా..

పనిచేసే వయసులో పనిలేని వాళ్లు రాష్ట్రంలో కోటిన్నర మంది ఉన్నట్లు ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి సర్వేలో వెల్లడైంది. సచివాలయాల ఉద్యోగులు గత నెలలో నిర్వహించిన సర్వేలో ఈ విషయాలను గుర్తించారు. 26 జిల్లాల్లో 2.67 కోట్ల మంది వివరాలను ఉద్యోగులు తెలుసుకున్నారు.

ఇందులో 52.69 లక్షల మంది ఏదో ఒక పని చేస్తున్నట్లు తేల్చారు. జిల్లాల్లో నిర్వహించిన సర్వేలో గుర్తించిన ఏ పనీ లేనివారు రాష్ట్రం మొత్తం మీద 1కోటి 56 లక్షల 50వేల 617 మంది ఉన్నారు. అనకాపల్లి జిల్లాలో 5లక్షల 43వేల 406 మంది, అనంతపురం జిల్లాలో 7లక్షల 24 వేల 16 మంది, అన్నమయ్య జిల్లాలో 5లక్షల 22వేల 604 మంది, బాపట్ల జిల్లాలో 5లక్షల 17వేల 823 మంది, చిత్తూరు జిల్లాలో 6 లక్షల 10వేల 517 మంది ఉన్నారు. ఇక కోనసీమ జిల్లాలో 6లక్షల 17వేల 590 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 5 లక్షల 36వేల 141 మంది, ఏలూరు జిల్లాలో 6 లక్షల 37వేల324 మంది, గుంటూరు జిల్లాలో 5 లక్షల 86 వేల100 మంది, కాకినాడ జిల్లాలో 6లక్షల 49వేల 36 మంది, కృష్ణా జిల్లాలో 4 లక్షల 20వేల 748 మంది, కర్నూలు జిల్లాలో 7లక్షల 62వేల 161 మంది, నంద్యాల జిల్లాలో 5వేల 91వేల 800 మంది, ఎన్టీఆర్‌ జిల్లాలో 5లక్షల 99వేల 636 మంది వరకు ఉన్నారు.

పల్నాడు జిల్లాలో 5లక్షల 87వేల 609 మంది, పార్వతీపురం మన్యం జిల్లాలో 3లక్షల 38వేల 718 మంది, ప్రకాశం జిల్లాలో 7లక్షల 137 మంది, నెల్లూరు జిల్లాలో 7లక్షల 48వేల 772 మంది, సత్యసాయి జిల్లాలో 6లక్షల 17వేల 317 మంది, శ్రీకాకుళం జిల్లాలో 7లక్షల 56వేల 789 మంది, తిరుపతి జిల్లాలో 6లక్షల 46వేల 484 మంది ఏ పనిలేని వారున్నట్లు సర్వేలో తేలింది. విశాఖ జిల్లాలో 5లక్షల 56వేల వంద మంది ఉన్నారు. విజయనగరం జిల్లాలో 6లక్షల 93వేల 335 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 5లక్షల 68వేల 445 మంది, వైఎస్సార్‌ జిల్లాలో 6లక్షల 28వేల 396 మంది, అల్లూరి జిల్లాలో అత్యల్పంగా 4లక్షల 89వేల 613 మంది ఉన్నారు. పని లేని వారిని గుర్తించిన ప్రభుత్వం వారందరికీ నచ్చిన రంగంలో నైపుణ్యాలు పెంచుకునేలా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. విద్యార్హతలు ఉన్న వారికి ఇళ్ల నుంచే పని చేసుకునేలా వివిధ సంస్థల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలని ప్రభుత్వం భావిస్తుంది.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: