ఇంటి అద్దె చెల్లించే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
_(3)-1738722077.jpeg)
కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్‌లో ఇంటి అద్దె చెల్లించే యజమానులకు శుభవార్త చెప్పారు. ఇంటి అద్దె ద్వారా వచ్చే ఆదాయ పరిమితిని ప్రస్తుతం ఏడాదికి రూ.2.4 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంచాలని ప్రతిపాదించారు. అద్దెపై TDS పరిమితిని పెంచాలని నిర్మలా సీతారామన్ తెలిపారు. పెరుగుదల తక్కువ అద్దె చెల్లించే పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం కలగనుంది.
ప్రస్తుతం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194-I ప్రకారం ఇంటి అద్దె ఆదాయం ఒకటి సంవత్సరానికి రూ.2.4 లక్షలకు మించకుండా ఉంటే పన్ను మినహాయింపు ఉంటుంది. కానీ 2025-26 బడ్జెట్‌లో ఈ పరిమితిని నెలకు రూ.50,000 (సంవత్సరానికి రూ.6 లక్షలు) చేయాలని ప్రతిపాదించారు. ఈ కొత్త నిబంధన వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు లేదా హిందూ అవిభక్త కుటుంబాలకు వర్తిస్తుంది.