జన్మతః పౌరసత్వం రద్దు.. ఎంత పని చేసావ్ ట్రంప్ మావా!

Wednesday, January 22, 2025 10:18 PM News
జన్మతః పౌరసత్వం రద్దు.. ఎంత పని చేసావ్ ట్రంప్ మావా!

తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉద్యోగాలు చేయాలని, సంతానానికి జన్మనివ్వాలని, అలా వారికి అమెరికా పౌరసత్వం దక్కాలని కోరుకొనే భారతీయులతోపాటు ఇతర దేశాల పౌరులకు అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు. జన్మతః పౌరసత్వం దక్కే విధానానికి మంగళం స్వస్తి పలికారు. తనకున్న అసాధారణ అధికారాలతో పదుల సంఖ్యలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు. 

అమెరికాలో నివసించే వలసదార్లకు, తాత్కాలిక వీసాలపై ఉంటున్నవారికి అమెరికాలో సంతానం జన్మిస్తే ఇకపై జన్మతః అమెరికా పౌరసత్వం లభించదు. తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా వారి బిడ్డలకు జన్మతః పౌరసత్వం లభించే వెసులుబాటు గత శతాబ్ద కాలంగా ఉంది. ఈ మేరకు వందేళ్ల క్రితమే 14వ రాజ్యాంగ సవరణ చేశారు. 1868లో చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని ట్రంప్ ఆదేశించారు. జన్మతః పౌరసత్వం లభించే అవకాశం ఉండొద్దని తేల్చిచెప్పారు. దీనివల్ల లక్షలాది మందికి ఇబ్బందులు ఎదురుకానున్నాయి.

ఇవాళ సోషల్ మీడియాలో రచ్చలేపుతున్న టాప్ హాట్ ఫోటోస్ ఇవే - గ్యాలరీ 1

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: