వరుడి సిబిల్ స్కోర్ లేదని పెళ్లి క్యాన్సిల్
Wednesday, February 12, 2025 09:45 PM News

మహారాష్ట్రలోని ముర్తిజాపూర్కు చెందిన ఓ యువతికి అదే ప్రాంతానికి చెందిన ఓ యవకుడితో పెద్దలు పెళ్లి సంబంధం కుదిర్చారు. వివాహానికి కావాల్సిన అని విషయాలు మాట్లాడుకొని తేదీ సైతం ఖరారు చేశారు. అయితే వివాహానికి కొన్ని రోజుల ముందు వధువు మేనమామ వరుడి సిబిల్ స్కోర్ను చెక్ చేయగా అతడు అనేక బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా సిబిల్ స్కోర్ కూడా తక్కువ ఉండడంతో వారు ఈ పెళ్లికి నిరాకరించారు.
CIBIL అందించే క్రెడిట్ స్కోరునే సిబిల్ స్కోరు అంటారు. వ్యక్తుల ఆర్థిక పరిస్థితిని, రుణాలను అంటే గృహ రుణం, వ్యక్తిగత రుణం, క్రెడిట్ కార్డు వంటి వాటిని ఎలా నిర్వహిస్తున్నారో డేటాను సేకరించి, క్రెడిట్ స్కోరును లెక్కిస్తుంది. బ్యాంకులు రుణాలు ఇచ్చే ముందు ఈ క్రెడిట్ స్కోరును పరిశీలించి మంచి స్కోరు ఉన్నవారికి త్వరితగతిన రుణాలు మంజూరు చేస్తాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: