భర్త కిడ్నీని రూ.10 లక్షలకు అమ్మేసి.. ప్రియుడితో పరార్!

ఓ మహిళ తన కూతురు చదువు కోసం భర్త కిడ్నీని రూ.10 లక్షలకు అమ్మేసింది. చివరకు ఆమె చేసిన నిర్వాకం చూసి అంతా ఆశ్చర్య పోతున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లా సంక్రైల్ ప్రాంతంలో ఇద్దరు దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 10 సంవత్సరాల కూతురు ఉంది. సుబ్బయ్య కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. అయితే కూతురు పెద్దదయ్యే కొద్దీ చదువు కోసం మరింత ఖర్చు చేయాల్సి వచ్చింది. వారి ఆర్థిక స్థోమత అంతంతే కావడంతో తీవ్ర ఇబ్బందులు పడేవారు.
ఈ క్రమంలో భార్యకు ఓ ఆలోచన వచ్చింది. భర్త కిడ్నీని విక్రయించి, తద్వారా వచ్చిన డబ్బులతో కూతురును బాగా చదివించాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని తన భర్తతో చెప్పింది. అయితే ఇందుకు అతను నిరాకరించాడు. ఆమె బలవంతం వల్ల చివరకు భర్త అంగీకరించాడు. దాంతో రూ.10.లక్షలకు భర్త కిడ్నీ విక్రయించింది. డబ్బులను తాను భద్రంగా బ్యాంకులో డిపాజిట్ చేస్తానని చెప్పడంతో భార్య చేతికి ఇచ్చాడు. అయితే ఆమె రాత్రి అదృశ్యమైంది. తెలిసిన వారి వద్ద విచారించినా ఆమె మాత్రం కనిపించలేదు. విచారిస్తే శుక్రవారం బరాక్‌పూర్ ప్రాంతంలో రవిదాస్ అనే పెయింటర్‌తో కలిసి ఉంటోందని తెలిసింది. కుటుంబ సభ్యులతో కలిసి భర్త అక్కడికి చేరుకోవడంతో ఆమె తలుపులు మూసేసింది. తనకు ఎవరూ అవసరం లేదని, త్వరలో విడాకలు పేపర్లు పంపిస్తానని సమాధానం ఇచ్చింది. దీంతో చివరకు భర్త పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.