దావోస్ లో ఆ ఐదు రోజుల్లో రికార్డు స్థాయిలో అమ్మాయిల బుకింగ్
స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ఈ నెల 20 నుంచి 24 వరకూ జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సదస్సుకు భారత్ తో పాటు ప్రపంచ దేశాల నుంచి నాయకులు, ప్రముఖులు, బడా పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ఈ సమయంలో ఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది.
బ్రిటీష్ మీడియా డైలీ మెయిల్ ఓ సంచలన విషయం తెరపైకి తెచ్చింది. ఆ ఐదు రోజులు సెక్స్ పార్టీలు జోరుగా జరిగాయని లైంగికపరమైన సర్వీసులను అందించే ఎస్కార్ట్ ఏజెన్సీలకు డిమాండ్ విపరీతంగా పెరిగిందని తెలిపింది. వీటితో పాటు లింగమార్పిడి మహిళల వద్దకు వెళ్లిన వారి సంఖ్య బాగా పెరిగిందని పేర్కొంది. సుమారు 3,000 మంది వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులు, నాయకులు హాజరైన వేళ ఈ తరహా కథనాలు తెరపైకి రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
దావోస్ లో జరిగే సదస్సుకు వచ్చే ప్రముఖులను దృష్టిలో పెట్టుకునో ఏమోకానీ. "డేట్ యూ పే ఫర్" ఫేరిట ఓ వెబ్ సైట్ ఈ తరహా కార్యకలాపాలను నిర్వహించిందని చెబుతున్నారు. ఒకేసారి చాలా మంది అమ్మాయిలను బుక్ చేసుకుని ఎంజాయ్ చేశారని, కేవలం 90 మంది కస్టమర్లు 300 మంది అమ్మాయిలను బుక్ చేసుకున్నారని డైలీ మెయిల్ పేర్కొంది. టిట్4టాట్ ప్రతినిధి మాట్లాడుతూ.. డబ్ల్యూఈఎఫ్ జరిగిన 5 రోజుల్లో 300 మంది అమ్మాయిలు, లింగ మార్పిడి మహిళలను దావోస్ లో బుక్ చేసుకున్నారని వివరించారు! ఈ విషయంలో ఇది సరికొత్త రికార్డ్ అని.. గత ఏడాది 170 మందినే బుక్ చేసుకుంటే.. ఈ సారి ఏకంగా 300 మందిని బుక్ చేసుకున్నారని.. బుకింగ్స్ లో ఇది సరికొత్త రికార్డ్ అని చెబుతున్నారని అంటున్నారు. దీంతో.. ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది. కొంతమంది మహిళలు ఒకే బుకింగ్ లో సుమారు 6,000 పౌండ్లు (రు.6.5 లక్షలు) సంపాదించారని, ఈ బుక్కింగ్ వ్యవధి 4 గంటలని తెలిపింది. ఈ ఈవెంట్ ప్రారంభమైనప్పటి నుంచీ మొత్తం బుక్కింగ్స్ లో ఈసారి ఏజెన్సీలు అన్నీ కలిపి సుమారు 9.68 కోట్ల రూపాయలు సంపాదించి ఉండొచ్చని అంచనా వేశారు.