ఆయన సినిమాలన్నీ బాయ్ కాట్ చేస్తాం.. వైసిపి హెచ్చరిక
Wednesday, February 12, 2025 09:00 AM News

లైలా సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో వైసీపీపై నాయుడు పృథ్వి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వైసీపీ శ్రేణులను పరుష పదజాలంతో దూషించిన పృథ్వీపై ఆ పార్టీ అధికార ప్రతినిధి వెంకట రెడ్డి కారుమూరు మండిపడ్డారు. తెలుగు ఇండస్ట్రీ బాగుండాలని చాలా పద్ధతిగా చెబుతున్నామని, కామ కుక్క పృథ్వీకి ఏ సినిమాలో అవకాశం ఇచ్చినా, ఏ సినిమా ఫంక్షన్కు అతణ్ని పిలిచినా ఆ సినిమాను బాయికాట్ చేస్తామని హెచ్చరించారు.
అలానే ఆ నిర్మాత, ఆ హీరోల అన్ని మూవీలను పద్ధతి ప్రకారం బాయ్ కాట్ చేస్తామని చెప్పారు. పృథ్వి వ్యాఖ్యలపై మండిపడుతున్న వైసిపి శ్రేణులు బాయ్ కాట్ లైలా అంటూ ట్వీట్ల వర్షం కురిపించారు. దాంతో పృథ్వి వ్యాఖ్యలకు తమ సినిమాకు ఏమి సంబంధం లేదని హీరో విశ్వక్ సేన్ క్షమాపణ కూడా చెప్పారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: