ఏపీ: బాయ్ ఫ్రెండ్ నంబర్ బ్లాక్ చేసాడని 100కు ఫోన్..
Friday, February 14, 2025 11:00 AM News

బాయ్ ఫ్రెండ్ తన నంబర్ బ్లాక్ చేశాడని ఓ యువతి ఏకంగా 100కు కాల్ చేసింది. ఈ విచిత్ర ఘటన అనంతపురం జిల్లా గుత్తిలో చోటు చేసుకుంది. 'అతను నాతో మాట్లాడట్లేదు. నంబర్ బ్లాక్ చేశాడు. మీరు వాడితో మాట్లాడి నా నంబర్ అన్ బ్లాక్ చేయించండి' అని 100కు ఫోన్ చేసి చెప్పింది.
గుత్తి పోలీస్ స్టేషన్ బ్లూ కోల్ట్స్ పోలీసులు ఆమెను సంప్రదించారు. అయితే, తన ఇంటికి రావొద్దని నంబర్ అన్ బ్లాక్ చేయిస్తే చాలని యువతి చెప్పింది. దీంతో స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ చేయాలని పోలీసులు సూచించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: