ట్రంప్ జీతం ఎంతో మీకు తెలుసా..?

Tuesday, January 21, 2025 03:31 PM Offbeat
ట్రంప్ జీతం ఎంతో మీకు తెలుసా..?

అమెరికా అధినేతగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన జీత భత్యాలు, కల్పించే ప్రత్యేక సౌకర్యాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం..

అమెరికా అధ్యక్షుడి శ్వేత సౌధం అధిపతి అని కూడా అంటారు. ఆరు అంతస్తుల ఈ శ్వేత సౌధాన్ని 1800లో నిర్మించారు. తర్వాత కాలక్రమేణా హంగులు జోడించుకుంటూ వస్తున్నారు. 55,000 వేల చదరపు అడుగులు కలిగిన ఈ భవనంలో 132 గదులు, 35 బాత్ రూమ్‌లు ఉన్నాయి. ఇందులోనే టెన్నిస్ కోర్ట్, జాగింగ్ ట్రాక్, మూవీ థియేటర్, స్విమ్మింగ్ పూల్ వంటివి ఉంటాయి.  అధ్యక్షుడి భోజనం ఏర్పాట్ల కోసం నిత్యం ఐదుగురు చెఫ్‌లు పనిచేస్తుంటారు. శ్వేతసౌధం కాకుండా బ్లెయిర్ హౌస్ అనే అతిథి గృహం కూడా అధ్యక్షుడికి ఇస్తారు. ఇది శ్వేతసౌధం కంటే పెద్దగా సుమారు 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో 119 గదులు, అతిథుల కోసం 20 బెడ్ రూములు, 35 బాత్ రూమ్‌లు, 4 డైనింగ్ హాల్స్, జిమ్, సెలూన్‌ ఉంటాయి.

అమెరికా అధ్యక్షుడి జీతం : అధ్యక్షుడి వార్షిక ఆదాయం 4 లక్షల డాలర్లు ఉంటుంది. భారత కరెన్సీ ప్రకారం ఇది రూ.3.3 కోట్ల వరకు ఉంటుంది. అంటే నెలకు రూ.28 లక్షల వేతనం అందుతుంది. రిటైరయ్యాక కూడా వార్షికంగా 2 లక్షల డాలర్లు అందుకుంటారు. అంతేకాదు లక్ష డాలర్ల అలవెన్సు ఇస్తారు. వ్యక్తిగత, అధికారిక ఖర్చుల కోసం ఏటా 50 వేల డాలర్లు (రూ.42 లక్షలు) అందిస్తారు. ప్రయాణ ఖర్చుల కోసం మరో లక్ష డాలర్లు(రూ.84 లక్షలు), వినోదం కోసం మరో 19 వేల డాలర్లు (రూ.16 లక్షలు) ఇస్తారు. ఇవన్నీ కలిపితే ఏటా అధ్యక్షుడికి 5.69 లక్షల డాలర్ల వరకు అందుతుంది.

ప్రయాణ సౌకర్యాలు : అమెరికా అధ్యక్షుడు ప్రయాణించడానికి ఓ ప్రత్యేక విమానాన్ని అందుబాటులో ఉంచుతారు. ఇదే ఎయిర్ ఫోర్స్ వన్ విమానం. ఇందులో సకల సౌకర్యాలు ఉంటాయి. ఈ విమానం గాలిలో ఉండగానే ఇంధనాన్ని నింపుకొనే సామర్థ్యం కలిగి ఉంటుంది. స్థానికంగా ప్రయాణించడానికి ఉన్న హెలికాప్టర్ పేరు మెరైన్ వన్. గంటకు సుమారు 241 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ హెలికాప్టర్ భారీ పేలుళ్లను తట్టుకోగలదు. ఇందులో ఉన్న మూడు ఇంజిన్‌లలో ఒకటి ఫెయిల్ అయినా ఎగరగలదు. ఇలాంటివి ఒకేలా ఉండే ఐదు హెలికాప్టర్లు ఉంటాయి. అధ్యక్షుడు ఎందులో ప్రయాణిస్తున్నాడో శత్రువులకు తెలియకుండా ఇలా ప్లాన్ చేశారు.

అత్యంత భద్రమైన కారు : ప్రపంచంలోనే అత్యంత భద్రమైన కారును అధ్యక్షుడి ప్రయాణానికి వినియోగిస్తారు. దీన్ని బీస్ట్ గా పిలుస్తారు. అధునాతన ఫీచర్లతో, భారీ భద్రతా ప్రమాణాలతో ఈ కారును తయారు చేశారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: