బడ్జెట్ ధరలో అద్దెకు భార్యలు.. మన దేశంలోనే

Friday, January 24, 2025 07:00 AM Offbeat
బడ్జెట్ ధరలో అద్దెకు భార్యలు.. మన దేశంలోనే

భారతదేశంలోని ఓ ప్రాంతంలో భార్యలను అద్దెకు తీసుకోవచ్చు. అద్దెకు తీసుకునే మహిళల్లో వివాహం కాని వారు కూడా ఉంటారు. అగ్రిమెంట్ కూడా ఉంటుంది. రూ.10 నుంచి రూ.100 వరకు స్టాంపు పేపర్లపై ఈ అగ్రిమెంట్ చేసుకుంటారు. 

మధ్యప్రదేశ్‌లోని శివపురిలో మహిళలను అద్దెకు ఇచ్చే సంత జరుగుతుంది. ధడీచా పేరుతో ఈ ఆచారం కొనసాగుతోంది. ఈ సంతలో యువతులు, మహిళలను అద్దెకు ఇస్తారు. ప్రతి సంవత్సరం నిర్ణీత సమయంలో ఈ సంత నిర్వహిస్తారు. అమ్మాయిలను కొనడానికి సుదూర ప్రాంతాల నుంచి పురుషులు వస్తారు. నెలలు, సంవత్సరాల వరకు కూడా అద్దెకు తీసుకుంటారు. ఆమె కుటుంబ సభ్యులు, అద్దెకు తీసుకునేవారు స్టాంపు పేపర్లపై ఒప్పందం చేసుకుంటారు. 

పెళ్లి చేసుకోవడానికి తగిన యువతి దొరకనివారు, తమ ఇళ్లలోని వృద్ధుల సంరక్షణ కోసం మహిళలు అవసరమైనవారు ఈ విధంగా ఒప్పందాలు చేసుకుంటారు. అందమైన మహిళలకు వేళం కూడా నిర్వహిస్తారు. అద్దె రూ.15,000 నుంచి ప్రారంభమవుతుందని సమాచారం. కొందరు వేలంలో లక్షల రూపాయల వరకు పలుకుతారు. కన్యలకు ఎక్కువ ధర ఉంటుందని సమాచారం. ఒప్పందాన్ని ఉల్లంఘించే పూర్తి హక్కు ఆ మహిళలకు ఉంటుందనే నిబంధలు ఉన్నాయి. ఆమె సంబంధంలో సంతోషంగా లేకున్నా, మరేదైనా కారణాల వల్ల ఈ ఒప్పందాన్ని మధ్యలోనే రద్దు చేసుకోవచ్చు. వాళ్లు రాసుకునే బాండ్ కాగితాలపై ఈ పాయింట్‌ను కూడా పేర్కొంటారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: