నీతులు చెప్పకు పవన్.. ఆ ఇద్దరినీ చంపింది నువ్వే
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమానికి మెగా ఫ్యాన్స్ భారీ సంఖ్యలో తరలి వచ్చారు. అయితే ఈ ఈవెంట్ నుండి ఇంటికి వెళుతున్న క్రమంలో ఇద్దరు యువకులు మరణించారు.
ఈ ఘటన మీద స్పందించిన పవన్ కళ్యాణ్ కాకినాడ-రాజమండ్రి మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు చెడిపోవడం వలన ప్రమాదం జరిగిందని, గత ఐదేళ్లలో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదని, కనీస నిర్వహణ కూడా చేపట్టలేదు.. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు జరిగాయని చెప్పుకొచ్చారు.
అయితే, పవన్ వ్యాఖ్యలపై స్పందించిన యాంకర్ శ్యామల ఆ ఇద్దరినీ నువ్వే చంపేశావని నిప్పులు చెరిగింది. ట్విట్టర్ వేదికగా యాంకర్ శ్యామల పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ ఓ పోస్ట్ చేసింది. "పవన్ కళ్యాణ్ నీతులు చెప్పడం వరకే గానీ ఆచరణలో ఉండవు.. గేమ్ ఛేంజర్ మెగా ఈవెంటుకు హాజరైన ఇద్దరు ఫ్యాన్స్ రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఈ ఘటనను రాజకీయం చేస్తూ నెపాన్ని గత ప్రభుత్వంపై నెట్టేసి చేతులు దులుపుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కాకినాడ-రాజమండ్రి రోడ్డు చిధ్రమైందని మీకు ముందే తెలిస్తే ఆ ఈవెంటుకు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు సర్.. సీజ్ ద రోడ్ అని అనాలి కదా...?" అని అన్నారు.
సినిమాలకు రండి.. చొక్కాలు చించుకోండి.. బైక్ రైసింగులు చేయండి.. ఈలలు వేసి గోలలు చేయండి అంటూ యువతను రెచ్చగొడుతూ మీరు మాట్లాడిన మాటలు ఒక రాష్ట్ర ఉపముఖ్యమంత్రి స్థాయితో ఉండి మాట్లాడాల్సిన మాటలేనా.. మీ కారణంగా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోతే కనీసం వెళ్లి పరామర్శించారా? అంటే మీ స్వార్థాలకు అమాయకుల ప్రాణాలు బలి చేస్తున్నారా..? అంటూ ట్విట్టర్ పోస్టులో పేర్కొన్నారు యాంకర్ శ్యామల.