డిసెంబర్ నాటికి సీఎం మార్పు?

Tuesday, March 4, 2025 03:00 PM Politics
డిసెంబర్ నాటికి సీఎం మార్పు?

కాంగ్రెస్‌ అధిష్ఠానం డిసెంబర్‌ నాటికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని పదవి నుంచి తప్పించడం ఖాయమని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో సోమవారం ఏలేటి మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కోర్‌ టీమ్‌ సభ్యురాలు మీనాక్షికి తెలంగాణ ఇన్‌చార్జిగా నియమిస్తూ అప్పగించిన టాస్క్‌ కూడా ఇదేనని చెప్పారు. డిసెంబర్‌ నాటికి 'మిషన్‌ సీఎం చేంజ్‌’ టాస్క్‌కు గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేయడమే లక్ష్యంగా మీనాక్షి నటరాజన్‌ పని చేస్తున్నారని తెలిపారు. తన కుర్చీ లాగేసేందుకు మంత్రులే యత్నిస్తున్నారని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సీఎం కుర్చీపై కన్నేశారని చెప్పారు. కాంగ్రెస్‌ సరార్‌, క్యాబినెట్‌ పూర్తిగా గాడితప్పాయని విమర్శించారు. ఎవరి రాజ్యం వారిదే అన్నట్టుగా సీఎం, మంత్రుల మధ్య గ్యాప్‌ ఏర్పడిందని తెలిపారు. ఒక మంత్రీ తనను లెక చేయట్లేదని సీఎం రేవంతే గాంధీభవన్‌లో మీనాక్షి నటరాజన్‌ వద్ద గోడు వెళ్లబోసుకున్నారని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: