రాజీనామా తరువాత తొలిసారి జీవీ రెడ్డి ట్వీట్
Saturday, March 1, 2025 11:00 AM Politics

టీడీపీకి రాజీనామా జీవీ రెడ్డి చేసిన సంగతి తెలిసిందే. రాజీనామా తర్వాత ఆయన చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేవలం రూ.33,000 కోట్ల రెవెన్యూ లోటుతోనే రూ.3.2లక్షల కోట్ల బడ్జెట్ రూపొందించారని బడ్జెట్ ను అభినందిస్తూ ట్వీట్ చేశారు.
రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, చంద్రబాబు నాయకత్వం పట్ల ఎప్పటికీ గౌరవం ఉంటుందని తెలిపారు. "తక్కువ కాలంలోనే పార్టీలో నాకు దక్కిన గౌరవం పట్ల ఆయనకు రుణపడి ఉంటాను. 2029లోనూ మా సార్ CM కావాలి" అంటూ ట్వీట్ చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: