దుమారం రేపుతున్న కేటీఆర్ ట్వీట్
Sunday, March 9, 2025 09:00 AM Politics

తెలంగాణకు రావాల్సిన రూ.1700 కోట్ల సోలార్ ప్రాజెక్టును ఏపీ దక్కించుకోవడంపై కేటీఆర్ చేసిన ట్వీట్ రాజకీయంగా దుమారం రేపుతోంది. "మా పాలనలో తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామం. కాంగ్రెస్ పాలనలో పెట్టుబడిదారులు తెలంగాణ కంటే గుజరాత్, తమిళనాడు ఆఖరుకు ఏపీని ఎంచుకుంటున్నారు" అని ట్వీట్ చేశారు.
కేటీఆర్ 'ఆఖరుకు' అనే పదం ఎందుకు వాడారని, ఏపీ పెట్టుబడులకు పనికిరాదా? అని నెటిజన్లు మండిపడుతున్నారు. కేటీఆర్ కు ఆ అహంకారం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: