ప్రశాంత్ కిశోర్ తో నారా లోకేశ్ భేటీ
Wednesday, February 5, 2025 08:00 AM Politics

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. మంగళవారం ఢిల్లీలో పర్యటించిన లోకేశ్ ప్రశాంత్ కిశోర్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సీఎం నివాసం 1-జన్పథ్ లో దాదాపు గంట పాటు ఈ భేటీ సాగింది.
ఏపీ, బిహార్, దేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, తెలంగాణలో టీడీపీ బలోపేతంపై ఇరువురూ చర్చించినట్లు తెలుస్తోంది. ఐప్యాక్ నుంచి బయటికొచ్చిన ప్రశాంత్ బిహార్ 'జన్ సురాజ్' పేరుతో పార్టీ ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: