వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా

వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. మర్రి రాజశేఖర్ 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చిలకలూరిపేట అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్ గా గెలిచారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి ప్రత్తిపాటి పుల్లారావు చేతిలో ఓడిపోయారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత 2010లో ఆయన వైఎస్ఆర్‌సీపీలో చేరారు. 2014లో చిలకలూరిపేట నుంచి వైసిపి అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. 2018లో వైఎస్ జగన్ పాదయాత్రలో ఆయన కీలకంగా వ్యవహరించారు. 2023 మార్చిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి తరపున ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. రాజశేఖర్ రాజీనామాతో వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీల సంఖ్య ఐదుకు చేరింది. ఇప్పటికే పోతుల సునీత, బల్లి కళ్యాణచక్రవర్తి,కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.