చంద్రబాబు ఫోన్ ఎత్తని పవన్ కళ్యాణ్

సీఎం చంద్రబాబు నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ హాజరు కాలేదు. కానీ ఆయన అనారోగ్యంతో బాధపడుతుండడంతోనే గైర్హాజరైనట్లు సమాచారం. మరోవైపు ఈరోజు పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల ఆలయ సందర్శనకు బయలుదేరారు. హైదరాబాద్ నుంచి కొద్దిసేపటి కిందట కేరళ చేరుకున్నారు.
అయితే అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉన్నత స్థాయి సమీక్షకు గైర్హాజరు కావడం ఏంటి? ఈరోజు ఆలయాల సందర్శనకు బయలుదేరడం ఏంటి అన్న చర్చ నడుస్తోంది. కూటమిలో ఏమైనా విభేదాలు ఉన్నాయా? అందుకే ఆయన అలా వ్యవహరిస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో మాట్లాడేందుకు ప్రయత్నించానని చెప్పారు. కానీ ఆయన అందుబాటులోకి రాలేదని, ఇప్పుడు ఎలా ఉన్నారు అంటూ మనోహర్ వద్ద ఆరా తీశారు. తాను స్వయంగా ప్రయత్నించిన పవన్ అందుబాటులోకి రాలేదని చంద్రబాబు బాహటంగానే చెప్పడం ఇప్పుడు చర్చకు దారితీసింది.