లోకేష్ డిప్యూటీ సిఎం కాదు.. సీఎం.. అందరి నోరు మూయించిన పవన్

Wednesday, January 22, 2025 12:22 PM Politics
లోకేష్ డిప్యూటీ సిఎం కాదు.. సీఎం.. అందరి నోరు మూయించిన పవన్

టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కాకమునుపే లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. లోకేష్ బృందంగా భావించే నేతలే ఈ తరహా వ్యాఖ్యలు చేయడంతో వాటికి ప్రాధాన్యత ఏర్పడింది. ఒకేసారి ఒక వ్యూహం ప్రకారం నేతలంతా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని కోరడంతో తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. 

ఈ వివాదంపై ఇన్ని రోజులు మౌనంగా ఉన్న పవన్ తిరుపతి నేత కిరణ్ రాయల్ తో కౌంటర్ ఇప్పించినట్లు ప్రచారం సాగుతోంది. లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని టిడిపి నేతలు ఎలా కోరుకుంటున్నారో..అలాగే జనసేన నాయకులు కూడా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నారని కిరణ్ రాయల్ చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి. కిరణ్ రాయల్ ప్రకటన నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న ప్రకటనలను మానుకోవాలని సూచించడం విశేషం. ఈ విషయంలో టిడిపి ఎలా వెనక్కి తగ్గడం వెనుక పవన్ ప్లాన్ సక్సెస్ అయినట్లు ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.

For All Tech Queries Please Click Here..!
Topics: