పోసాని కీలక నిర్ణయం.. ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం..!

Tuesday, April 1, 2025 10:00 AM Politics
పోసాని కీలక నిర్ణయం.. ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం..!

సినీ నటుడు పోసాని కృష్ణ మురళి ఇటీవల బెయిల్ పై విడుదలయిన విషయం తెలిసిందే. కానీ వారంలో రెండు రోజులపాటు ఆయన సిఐడి కార్యాలయంలో సంతకం పెట్టాలి. విచారణకు సహకరించాలని కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పోసాని కృష్ణ మురళిపై ఇప్పట్లో కేసులు ముగిసినట్లు కనిపించడం లేదు. అయితే రిమాండ్ నుంచి బయటకు వచ్చిన పోసాని కృష్ణమురళి చాలా నీరసంగా కనిపించారు. తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను చూసి కన్నీటి పర్యాంతం అయ్యారు. 

తాజాగా ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీలో తిరిగి యాక్టివ్ అయ్యేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాజకీయ మద్దతు లేనిదే తన కేసుల విషయంలో ఇబ్బందికర పరిస్థితులు తప్పవని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే తిరిగి వైసిపిలో యాక్టివ్ కావడమే ఉత్తమం అన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పోసాని కృష్ణ మురళి వైసిపి విషయంలో స్పందించేవారు. ఒకానొక దశలో ఆయన సాక్షిలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కార్యక్రమానికి హోస్ట్ గా కూడా సిద్ధపడ్డారు. అందుకు సంబంధించి ప్రమోషన్ వర్క్ కూడా నడిచింది. అయితే ఇంతలో ఏమైందో ఏమో కానీ తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ప్రకటించారు. ఇకనుంచి రాజకీయాలు మాట్లాడనని కూడా స్పష్టం చేశారు. అయితే కూటమి ప్రభుత్వం నుంచి ఎదురయ్యే కేసులకు భయపడి పోసాని అలా చేసినట్లు అప్పట్లో ప్రచారం సాగింది. అయితే కూటమి ప్రభుత్వం ఆయనపై వెనక్కి తగ్గలేదు. వరుసగా కేసులు నమోదు చేసి ఉక్కిరిబిక్కిరి చేసింది.

వైసీపీకి బలమైన మద్దతు దారుడుగా ఉండే పోసాని కృష్ణ మురళి 2014 పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ నాయకత్వాన్ని సమర్ధించారు. అంతకుముందు ప్రజారాజ్యం పార్టీలో పని చేశారు. ఆ పార్టీ తరఫున పోటీ కూడా చేశారు. అయితే పిఆర్పి కాంగ్రెస్ లో విలీనం అయిన తర్వాత రాజకీయాల నుంచి తప్పుకున్నారు. మళ్లీ వైసిపిలో చేరి ఆ పార్టీ వాయిస్ బలంగా వినిపించారు. 2019లో వైసిపి అధికారంలోకి రావడంతో పోసాని కృష్ణమురళికి ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశమిచ్చారు. వైసీపీకి చాలామంది సినీ నటులు మద్దతు తెలిపినా పోసాని స్థాయిలో ఎవరికి కీలక పదవులు లభించలేదు.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: