మొగుడు పెళ్ళాం.. మధ్యలో నలుగుతున్న మోడీ

Wednesday, January 29, 2025 09:23 AM Politics
మొగుడు పెళ్ళాం.. మధ్యలో నలుగుతున్న మోడీ

దేశమే నా కుటుంబం అని ప్రధాని మోడీ ఎప్పుడూ చెబుతూ ఉంటారు. సంసారిక బాధలు లేని ఆయనకు ఇప్పుడు కొత్త సమస్య తలెత్తింది. ఇద్దరు మొగుడు, పెళ్ళాల మధ్య నలిగిపోతున్నారు. ఇద్దరు మేధావులైన భార్య భర్తల మధ్య ఉన్న సైద్ధాంతిక విభేదాలు ఆయనకు ఇబ్బంది కలిగిస్తున్నాయి.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, మాజీ టీడీపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ భార్యా భర్తలు. నిర్మల సీతారామన్ గురించి కొత్త గా చెప్పడానికి ఏమి ఉండదు. దేశంలో రెండవ మహిళా ఆర్థిక మంత్రి ఆమె. అత్యధిక సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఆమెనే. ఇప్పటికి 7 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టారు. నిర్మల బీజేపీ నాయకురాలు, కరుడు కట్టిన హిందుత్వవాది. పరకాల ప్రభాకర్ కుటుంబం తొలినాళ్ళ నుంచి కాంగ్రెస్ వాదులు. ప్రభాకర్ తండ్రి పరకాల శేషావతారం ఉమ్మడి రాష్ట్రం లో 70లలో మంత్రిగా చేశారు. పరకాల కుటుంబం లో వామపక్ష భావజాలం ఉన్న వాళ్లు ఉన్నారు. ప్రభాకర్ ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ లో తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువు కున్నారు. అక్కడే డాక్టరేట్ చేసారు. నిర్మలా కూడా జేఎన్యూలోనే చదివారు. ఇద్దరి అభిప్రాయాలు, సిద్ధాంతాలు వేరు. 1986లో వీళ్లిద్దరికీ వివాహం జరిగింది. పరకాల మోడీ విధానాలపై పోరాటం చేస్తున్నారు. ఆయన భార్య సాక్షాత్తు దేశ ఆర్ధిక మంత్రి. ప్రధాని మోడీకి రైట్ హ్యాండ్. కానీ ఒకే కుటుంబం లో రెండు విధానాలు. పరకాల నిత్యం బీజేపీ, మోడీ విధానాలను ఉతికి అరేస్తూ ఉంటారు. బీజేపీ ఈవీఎంలను టాంప్టర్ చేస్తోందని, ఎన్నికల అక్రమాలకు పాల్పడుతోందన్నది ప్రభాకర్ ఆరోపించారు. 

అంతర్గతంగా పరకాల వ్యవహారంపై నిర్మల, ప్రధాని మోడీ అసహనంగానే ఉన్నారు. కానీ పరకాలకు చెప్పి దారిలోకి తెచ్చుకోవడం సాధ్యం కాదు కనుక వదిలేసారు. ఆయనను ఎలా కంట్రోల్ చేయాలో ప్రధానికి, బీజేపీకి అర్థంకావడం లేదు. ప్రభాకర్, సీతారామన్ ఇద్దరు ఇప్పుడు విడి విడిగా ఉంటున్నారు. ఏం చేయాలో అర్థంకాక ప్రధాని మోడీ అసహనంతో దిక్కులు చూస్తున్నారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: