టీడీపీకి షాక్, వైసీపీలోకి మరో ఎమ్మెల్యే

Tuesday, March 26, 2019 12:53 PM Politics
టీడీపీకి షాక్, వైసీపీలోకి మరో ఎమ్మెల్యే

అధికార టీడీపీకి మరొక షాకు తగిలింది, టీడీపీ నుంచి వైసీపీలోకి వ‌ల‌స‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు ఎమ్మెల్యే, ఎంపీలు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. తాజాగా చంద్ర‌బాబుకు మ‌రో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. ప్ర‌కాశం జిల్లా ఎర్ర‌గొండ‌పాలెం ఎమ్మెల్యే డేవిడ్‌రాజు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. దీంతో ఈ ఎన్నిక‌ల్లో టీడీపీకి గ‌ట్టి ఎదురుదెబ్బేన‌ని చెప్పాలి.

గ‌త ఎన్నిక‌ల్లో డేవిడ్ రాజు ఎర్ర‌గొండ‌పాలెం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ త‌ర్వాత నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి కోసం తాను టీడీపీలో చేరుతున్నాన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. కానీ ఆయ‌న‌కు ఆ పార్టీకి గౌర‌వం దక్కలేదు. నియోజ‌క‌వ‌ర్గానికి ఆయ‌న చేసింది కూడా ఏమీ లేదు. ఎక్క‌డి స‌మ‌స్య‌లు అక్క‌డే ఉండిపోయాయి. క‌నీస హామీల‌ను కూడా ఆయ‌న నెర‌వేర్చ‌లేద‌ని ఆయనపైన విమ‌ర్శ‌లు ఉన్నాయి.

నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి కోసం టీడీపీలో చేరిన డేవిడ్ రాజుకు తీవ్ర నిరాశే ఎదురైంది. చంద్ర‌బాబు కూడా ఆయ‌న‌ను ప‌ట్టించుకున్న‌దీ లేదు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇదే స‌మ‌యంలో ఈసారి ఆయ‌న‌కు చంద్ర‌బాబు ఎర్ర‌గొండ‌పాలెం టికెట్ ఇవ్వ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ గెలుపుకోసం కృషి చేస్తాన‌ని డేవిడ్‌రాజు అన్నారు. 

For All Tech Queries Please Click Here..!