వైసీపీ లకొడకల్లారా.. నా తల్లి బ్రతికుంటే నరికేసేవాడిని: పృథ్వీ (వీడియో)

లైలా సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో సీనీ నటుడు పృథ్వీ వైసిపి టార్గెట్ గా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, తరువాత హై బీపీ రావడంతో ఆసుపత్రిలో చేరడం తెలిసిందే. దీనిపై విశ్వక్ సేన్ సారీ కూడా చెప్పారు. అయితే వివాదం ముగిసినట్లేనని అంతా భావిస్తున్న తరుణంలో మరో బాంబు పేల్చాడు పృథ్వి. వైసీపి వారిని ల.. కారాలతో తిట్టాడు. "11 అనే మాట వింటే గజ గజ అని వణికిపోతున్నారు. మా తల్లి బ్రతికి ఉన్నప్పుడు తిడితే ఒక్కొక్కడిని నరికేసేవాడిని... మిమ్మల్ని దరిద్రపు, లజకోడ....లారా అని అనాలి అంటూ బండబూతులతో రెచ్చిపోయాడు.
"ఫోనుల్లో బెదిరిస్తారా?...తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఫోనులు మొదలు పెట్టారు. సెకన్ సెకన్‌కు ఫోన్ చేశారు. నా దగ్గర ప్రతి నెంబర్ ఉంది. సుమారు నాలుగు వందల ఫోనులు వచ్చాయి. నా తల్లి చనిపోయినా సరే ఆవిడకు మనశ్శాంతి లేకుండా చేశారు. తల్లి కనక బ్రతికి ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడి ఉంటే నరికేసే వాడిని. అందరిపై సైబర్ క్రైంకు ఫిర్యాదు చేస్తాను" అంటూ పృథ్వి మండిపడ్డారు. పృథ్వి వైసిపి నేతలను తిట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.