విజయ్ సాయి రెడ్డికి గవర్నర్ పదవి? త్వరలో ఉత్వర్వులు
రాజకీయాల నుండి విజయసాయిరెడ్డి వైదొలగిన సంగతి తెలిసిందే. రాజీనామా చేసి తాను వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు. తాను ఏ పార్టీలో చేరేది లేదని కూడా స్పష్టం చేశారు. బీజేపీ ఒత్తిడి మేరకే విజయసాయిరెడ్డి రాజీనామా చేశారన్న వార్తలు సామాజిక వైరల్ అవుతున్నాయి. కొంత కాలం క్రితం అమిత్ షాను కలిసినప్పుడే ఈ నిర్ణయం వెలువడిందని చెబుతున్నారు.
ఆయన జగన్ తో చెప్పి మరీ రాజీనామా చేసి మరీ ఢిల్లీని వదిలి వచ్చారు. కేసుల నుంచి తప్పించుకోవడానికే అంటే ఆయనపై కేసులను తప్పించడం సాధ్యం కాదన్నది న్యాయనిపుణుల వాదన. అందుతున్న సమాచారం మేరకు తాను రాజీనామా చేసిన స్థానాన్ని టీడీపీ కాకుండా బీజేపీలో ఒక ప్రముఖ నేతకు ఇవ్వాలని నిర్ణయించడంతోనే ఆయన రాజీనామా చేసినట్లు ప్రధానంగా వైసీపీ చీఫ్ జగన్ కు కూడా సమాచారం అందినట్లు సమాచారం. విజయసాయిరెడ్డికి గవర్నర్ పదవి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమయిందని తెలుస్తోంది. గవర్నర్ గిరీ అయితే రాజకీయాలతో సంబంధం లేకుండా హుందాగా ఉండవచ్చని, తనకు ఉన్న ఇబ్బందుల నుంచి కూడా తప్పించుకునే అవకాశముందని కూడా ఆయన భావిస్తున్నట్లు సమాచారం. విజయసాయిరెడ్డిని గవర్నర్ గా నియమిస్తూ త్వరలోనే ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.