వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలతో వైఎస్‌ జగన్‌ భేటీ

Tuesday, November 12, 2024 09:29 AM Politics
 వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలతో వైఎస్‌ జగన్‌ భేటీ

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మరి కొద్ది సేపట్లె వైసీపీ పార్టీ ఎమ్మెల్సీలతో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ భేటీ అవనున్నారు. ఎమ్మెల్సీలు శాసనమండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.కాగా,అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంపై నిరసనగానే వైఎస్సార్‌సీపీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయమే ఎమ్మెల్యేలతో  వైఎస్‌ జగన్‌ భేటీ అయ్యారు.

సభలో కూటమి తర్వాత ఎక్కువ ఓ‌ట్‌ షేర్‌ ఉన్న వైఎస్సార్‌సీపీని  స్పీకర్‌ ప్రతిపక్షంగా గుర్తించకపోవడం, గత సమావేశాల్లో మాట్లాడేందుకు పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌కు మైక్‌ ఇవ్వకపోవడంతో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను వైఎస్సార్‌సీపీ బాయ్‌కాట్‌ చేసింది. ఇక నుంచి మీడియా ఎదుటే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని వైఎస్‌ జగన్‌ ఇప్పటికే ప్రకటించారు.

For All Tech Queries Please Click Here..!
Topics: