నీవు దేవుడివి సామి అంటూ అక్షర్ పటేల్ కాళ్లు మొక్కబోయిన కోహ్లి

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా తన అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తోంది. లీగ్ స్టేజిలో మూడు వరుస విజయాలతో సెమీఫైనల్‌కు అజేయంగా ప్రవేశించింది. ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌ను 44 పరుగుల తేడాతో ఓడించి దుమ్మురేపింది. సెమీఫైనల్లో మంగళవారం భారత్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్ మధ్య ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 249 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (79), హార్దిక్ పాండ్యా (45), అక్షర్ పటేల్ (42) రాణించారు. లక్ష్య ఛేదనలో కివీస్ బ్యాటర్లు భారత స్పిన్నర్ల ధాటికి తట్టుకోలేకపోయినా, కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఒంటరి పోరాటం చేశాడు.అయితే, 41వ ఓవర్లో అక్షర్ పటేల్ అద్భుతమైన ఫ్లైటెడ్ డెలివరీతో విలియమ్సన్‌ను స్టంప్ ఔట్ చేసి భారత్‌కు కీలక బ్రేక్ ఇచ్చాడు. అదే అతడి స్పెల్ చివరి బంతి కావడం విశేషం. ఈ విజయోత్సాహంలో విరాట్ కోహ్లీ ఉత్సాహంతో అక్షర్ పటేల్ కాళ్లకు తలవంచే ప్రయత్నం చేశాడు. అయితే, వెంటనే అక్షర్ కింద కూర్చుని నవ్వుతూ కోహ్లీని ఆపాడు. ఈ సంఘటన వీడియో వైరల్‌గా మారింది.