లక్ష రూపాయల ఐఫోన్.. రూ. 20 వేలకే
_(19)-1739504707.jpeg)
ఐ ఫోన్ కొనాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. అలాంటి వారికి లక్ష రూపాయల ఐ ఫోన్ ను రూ.20 వేలకే కొనే ఛాన్స్ అమెజాన్ కల్పిస్తోంది. iPhone 14 512GB కేవలం 20 వేల రూపాయలతో అమెజాన్ లో కొనే అవకాశం ఉంది. అయితే అందుకోసం కొన్ని ట్రిక్స్ పాటించాల్సి ఉంటుంది. Apple కంపెనీ 2024 లో iPhone16 లాంచ్ చేయడంతో అందరి అటెన్షన్ ఆ కొత్త మోడల్స్ పైకి వెళ్లింది. దీంతో ఐ ఫోన్ 14 ధర భారీగా పడిపోయింది. 256GB, 512GB IPhone 14 వేరియెంట్స్ చాలా తక్కువ ధరకు వస్తున్నాయి.
iPhone 14 512GB మోడల్ పై అమెజాన్ భారీ డిస్కౌంట్ ఇస్తోంది. రూ.99,990 ఉన్న ఈ ఫోన్ ధర డిస్కౌంట్ తర్వాత రూ.71,900 కు తగ్గింది. అంటే అమెజాన్ 28 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. కొన్ని క్రెడిట్, డెబిట్ కార్డ్స్ ఇన్ స్టంట్ డిస్కౌంట్ కింద రూ.2 వేలు డిస్కౌంట్ ఇస్తున్నాయి. కొన్ని బ్యాంక్ ఆఫర్లు అప్లై అయితే మరో రూ.2157 సేవ్ అవుతాయి. ఇక అమెజాన్ మాస్సివ్ ఎక్స్ చేంజ్ ఆఫర్ అందిస్తోంది. మంచి ఫోన్ అయితే ఎక్స్ చేంజ్ ఆఫర్ 53 వేల 200 రూపాయలు వస్తుంది. ఇవన్నీ కలుపుకుంటే రూ.18,700కు ఈ ఫోన్ ను కొనేయొచ్చు. అయితే ఆ ఆఫర్స్ అప్లై చేసుకోవడంతో పాటు మన ఓల్డ్ ఫోన్ క్వాలిటీదై ఉండి రూ.53,200 వస్తే బంపర్ ఆఫర్ దక్కించుకోవచ్చు.