డీప్ సీక్ కు పోటీగా భారత్ ఎఐ టూల్.. అతిపెద్ద స్వదేశీ భాషా నమూనాతో రూపకల్పన

Friday, January 31, 2025 11:00 AM Technology
డీప్ సీక్ కు పోటీగా భారత్ ఎఐ టూల్.. అతిపెద్ద స్వదేశీ భాషా నమూనాతో రూపకల్పన

చైనా ఏఐ యాప్ డీప్‌సీక్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ కూడా ఏఐ టూల్ రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. దేశీయంగా అతిపెద్ద స్వదేశీ భాషా నమూనాతో ఏఐ టూల్‌ను రూపొందించనున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం వెల్లడించారు. ఇండియన్ ఏఐ మెషిన్ కోసం కేటాయించిన రూ.10,370 కోట్లలోనే కొత్త ఏఐ టూల్ అభివృద్ధి కూడా చేపట్టనున్నట్లు తెలిపారు.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 10 కంపెనీలను గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్, హైఎండ్ చిప్స్ సరఫరా కోసం ఎంపిక చేసింది. వీటిని ఉపయోగించి మెషీన్ లెర్నింగ్ టూల్స్ ద్వారా ఫౌండేషనల్ మోడల్‌ను రూపొందించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన వాటిలో హీరానందాని గ్రూప్‌కు చెందిన యోట్టా, జియో ప్లాట్‌ఫామ్స్, టాటా కమ్యునికేషన్, ఈ2ఈ నెట్‌వర్క్స్, సీఎంఎస్ కంప్యూటర్స్, కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్, లోకజ్‌ ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్, నెక్ట్స్ జెన్ డేటా సెంటర్, ఓరియంట్ టెక్నాలజీస్, వెన్‌సిస్కో టెక్నాలజీస్ వంటి సంస్థలు ఉన్నాయి.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: